Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన పీసీ.. 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్ (Nick Jonas)ను వివాహం చేసుకొని లాస్ఏంజెల్స్లో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.
మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఖరారైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం భారత్‌కు వచ్చారు పీసీ. ఈ క్రమంలో ముంబై (Mumbai)లో రూ. కోట్ల విలువైన ఆస్తులను ప్రియాంక అమ్మేసినట్లు తెలిసింది. అంధేరీ వెస్ట్ ఏరియా (Andheri West area)లో ఉన్న నాలుగు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను రూ.16.17 కోట్లకు విక్రయించినట్లు ఇండెక్స్ ట్యాప్ నివేదించింది.
లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్ (Oberoi Sky Gardens)లోని 18వ అంతస్తులో ఉన్న మూడు ఫ్లాట్లు వరుసగా రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక 19వ అంతస్తులో ఉన్న జోడి యూనిట్ అయిన నాలుగో ఫ్లాట్ రూ.6.35 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది. ఈ నాలుగు ఫ్లాట్స్‌పై స్టాంప్ డ్యూటీ కింద రూ.83 లక్షలు చెల్లించినట్లు సదరు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read..
Film ticket | సినీ ప్రియులకు గుడ్‌న్యూస్.. సినిమా టికెట్లు రూ.200కే పరిమితం చేసిన కర్ణాటక ప్రభుత్వం
Sobhita-Naga Chaitanya | శోభితతో హనీమూన్ ట్రిప్‌కి వెళ్లిన నాగ చైతన్య.. ఫొటో వైరల్