Pongal Releases| పండగ సమయంలో తెలుగు సినిమాల సందడి వేరే లెవల్. పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి రేస్ లో సినిమాలు ఓ రేంజ్ లో విడుదల అవుతుంటాయి. ఇక ఆ సినిమాలు వచ్చి హిట్ అయితే వాటి లాంగ్ రన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక అన్ని పండుగలలో సంక్రాంతి బరిలో వచ్చి హిట్ టాక్ పడితే మాత్రం ఆ చిత్రానికి భారీ వసూళ్లు రావడం ఖాయం.ఈ సంక్రాంతి రేస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్”తో స్టార్ట్ చేయగా ఈ సినిమా తర్వాత నందమూరి మాస్ గాడ్ బాలకృష్ణ నటించిన భారీ సినిమా “డాకు మహారాజ్ రిలీజ్ అయింది.. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత చివరి సినిమాగా విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో పలకరించారు.
అయితే ఈ మూడు సినిమాలలో వెంకీ సినిమా పెద్ద హిట్ కాగా, బాలయ్య సినిమా పర్వాలేదనిపించింది. ఇక రామ్ చరణ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి ఏయే సినిమాలు విడుదల కాబోతున్నాయనే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే డ్రాగన్ చిత్రం జనవరి 10కే వస్తుందని అంటున్నారు.ఇంక హీరో సెట్స్ లోకి అడుగుపెట్టలేదు కాని ప్రశాంత్ నీల్ నవంబర్ వరకు షూటింగ్ ఫినిష్ చేయాలనే కసిలో ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇక చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికకు ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తరహాలో దీన్ని కూడా నాలుగైదు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు అనీల్. ఇక నవీన్ పోలిశెట్టి – మీనాక్షి చౌదరిల అనగనగా ఒక రాజుని సంక్రాంతికే ప్లాన్ చేస్తోంది సితార సంస్థ. రవితేజ – కిషోర్ తిరుమల, వెంకటేష్ – సురేందర్ రెడ్డి కాంబోలో ప్రాజెక్టులు ప్రస్తుతం చర్చల దశలో ఉండగా, ఈ సినిమాలు ఫిక్స్ అయితే డిసెంబర్ వరకు ఫస్ట్‌కాపీ సిద్ధం చేయాలనే పనిలో దర్శకులు ఉన్నారట. ఆ తర్వాత సంక్రాంతికి వాటిని రిలీజ్ చేస్తారని టాక్. మరి వచ్చే ఏడాది ఈ పందెం కోళ్లలో ఎవరు ఫిక్స్ ఎవరు డ్రాపనేది కాలమే నిర్ణయించాలి.