Priyanka Chopra | ఎర్లీ థర్టీస్‌లో ఉండగా అమ్మ సలహా మేరకు నా అండాలను దాచిపెట్టా
Priyanka Chopra | బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కథానాయిక ప్రియాంకా చోప్రా ఇటీవల డాక్స్ షెఫర్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని వెల్లడించింది. తాను 30ల ప్రారంభంలో ఉన్నప్పుడు తన తల్లి, ఆబ్స్ట్రెట్రీషియన్- గైనకాలజిస్ట్ అయిన మధు చోప్రా సలహా మేరకు అండాలను దాచిపెట్టానని చెప్పింది.
ముంబై: బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కథానాయిక ప్రియాంకా చోప్రా ఇటీవల డాక్స్ షెఫర్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని వెల్లడించింది. తాను 30ల ప్రారంభంలో ఉన్నప్పుడు తన తల్లి, ఆబ్స్ట్రెట్రీషియన్- గైనకాలజిస్ట్ అయిన మధు చోప్రా సలహా మేరకు అండాలను దాచిపెట్టానని చెప్పింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, పెద్దవాళ్ల కంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికే తాను ప్రాదాన్యం ఇస్తానని తెలిపింది.
ముప్పైల ప్రారంభంలో అండాలను దాచిపెట్టుకోవడం తనకు స్వేచ్ఛా భావనను కలిగించిందని ప్రియాంకాచోప్రా చెప్పింది. ఆ స్వేచ్ఛా భావనతోనే కెరీర్లో సాధించాలనుకున్న లక్ష్యాల దిశగా కొనసాగగలిగానని తెలిపింది. అప్పట్లో తాను ఎవరితో పిల్లలను కనాలనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయానని, అందుకే అండాలను దాచిపెట్టుకొమ్మని అమ్మ సలహా ఇచ్చిందని వెల్లడించింది.
తనకు ఎప్పుడూ పిల్లలను కనాలని ఉండేదని, కానీ అప్పటికి 25 ఏళ్ల వయసులో ఉన్న నిక్ జోనస్‌కు పిల్లలను కనడం ఇష్టం ఉందో లేదోనన్న అనుమానం ఉండేదని, అప్పట్లో అతనితో డేటింగ్‌కు ఒప్పుకోకపోవడానికి అదీ ఒక కారణమని ప్రియాంకా చోప్రా వివరించింది. అయితే చివరికి ప్రియాంకా, నిక్ జోనస్ 2022 జనవరిలో సరోగసి ద్వారా ఆడబిడ్డను కన్నారు. 2018 డిసెంబర్ 1, 2 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

