గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో ప్రియాంక యాక్షన్ మోడ్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తెలుగులో ప్రియాంకచోప్రా మరో భారీ చిత్రంలో భాగంకాబోతున్నట్లు తెలిసింది. ప్రభాస్ ‘కల్కి-2’ సినిమాలో ఈ భామ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
‘కల్కి’ తొలిభాగంలో నటించిన దీపికా పడుకోన్‌ను సీక్వెల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం ప్రియాంకచోప్రాను ఖరారు చేసిందని అంటున్నారు. అలియాభట్, సాయిపల్లవి, అనుష్క వంటి అగ్ర తారల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రియాంక తన సమ్మతిని తెలియజేసిందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఈ వార్తలో వాస్తవమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వేచిచూడాల్సిందే.