Priyanka Chopra | బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న వారణాసి సినిమాలో నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉంది. కాగా ప్రియాంకా చోప్రా నమ్రతా శిరోద్కర్, సితారతో కలిసి సందడి చేసింది. ఇంతకీ ఈ ముగ్గురూ కలిసింది ఎక్కడో తెలుసా..? సిటీలో ఉన్న వన్ ఆఫ్ ది హైఎండ్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో.
ఈ సందర్భంగా నమ్రతా, సితార, ప్రియాంకా చోప్రా కెమెరాకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియాంకా చోప్రా ఆ తర్వాత ఏఎంబీ సినిమాస్ మేనేజ్ మెంట్, స్టాఫ్‌తో కూడా ఫొటోలు దిగింది. ఏఎంబీ సినిమాస్‌లో సందడి చేసిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వారణాసి చిత్రంలో మందాకిని పాత్రలో కనిపించబోతుంది ప్రియాంకా చోప్రా. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నవారణాసిలో మాధవన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. వారణాసి మూవీ ఫస్ట్ పార్ట్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Proof that the best is visited only by the best 🌟
Because when it comes to the perfect movie experience, there’s only one destination ✨And some experiences can only happen at #AMBCinemas 😌
Like our Mandakini, @priyankachopra along with #NamrataShirodkar… pic.twitter.com/vPVzYNgZxF
— AMB Cinemas (@amb_cinemas) May 25, 2026