Priyanka Chopra| హోళి పండుగని దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఏకంగా మహేష్-రాజమౌళి మూవీ సెట్లో హోళి సెలబ్రేషన్స్ జరుపుకోవడం విశేషం.ఎస్ఎస్ఎమ్బీ 29లో ప్రియాంక చోప్రా కథనాయిక కాగా, రీసెంట్‌గానే ఈ సినిమా కోసం ఇండియాకు వచ్చింది. ఒడిశాలో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌కు వెళ్లింది. ఇక హోలీ అని, రాజమౌళి టీంతో కలిసి హోళి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అందుకు సంబంధించి ప్రియాంక చోప్రా ఓ పోస్ట్ పెట్టింది. హోలీ రోజు కూడా మాకు వర్కింగ్ డే అని తన టీంతో హోలీని సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా పంచుకుంది.
హోలీ సందర్భంగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తన సెలబ్రేషన్ ఫోటోలతో పాటు రంగులను సైతం ఫోటో తీసి షేర్ చేశారు. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా వేసిన పోస్ట్‌కు నమ్రత స్పందించడంతో అది మహేష్-రాజమౌళి మూవీ సెట్ అని అందరు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒరిస్సా రాష్ట్రంలోని కోరట్ పూర్ లో జరుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్ లో ప్రియాంక సైతం పాల్గొంటున్నారు. ఇటీవల ప్రియాంక భర్త, అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ కూడా ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ప్రియాంక తమ్ముడు సిద్ధార్థ పెళ్లి కోసం నిక్ ఫ్యామిలీ ఇండియాకి రాగా, వారందరితో కలిసి ప్రియాంక చోప్రా తెగ సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక ఇదిలా ఉంటే ఇటీవల మహేష్-రాజమౌళి మూవీకి సంబంధించిన వీడియో ఒకటి లీకైన విషయం తెలిసిందే. దాంతో రాజమౌళి తన టీంకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. సెట్లో ఫోన్స్ వాడకూడదు.. ఫోటోలు తీయకూడదని ఆర్డర్ పాన్ చేసాడు. ఈ లీక్‌ల మీద జక్కన్న చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్లను ఈ మూవీ కోసం పని చేస్తుండగా, చిత్రాన్ని పాన్ వరల్డ్‌గా ప్లాన్ చేశాడన్న సంగతి తెలిసిందే.