శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్‌లో ఆత్మాభిమానం కాస్త ఎక్కువే. ఒక స్త్రీగా స్త్రీత్వాన్ని అమితంగా గౌరవిస్తుందామె. రీసెంట్గా ముంబై వేదికగా జరిగిన ‘వీ ది విమెన్ ఆసియా’ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడిన మాటలు అందుకు అద్దం పడుతున్నాయి. ‘సమానత్వం అనేది మొదలయ్యేది మాటలతోనే. ఈ విషయం గురించి ప్రతి మహిళా ఓపెన్‌గా మాట్లాడాలి. అప్పుడే తర్వాత తరానికి కూడా దీనిపై అవగాహన ఏర్పడుతుంది.
స్త్రీలు అత్యంత శక్తిమంతులు. వారిని ప్రోత్సహిస్తే ఏ స్థాయికైనా ఎదిగే శక్తి వారికుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఒక మహిళగా పుట్టినందుకు నేనెప్పుడూ గర్విస్తూనే ఉంటా. తమకు తాము ప్రశంసించుకుంటూ ముందుకుసాగాల్సిన అవసరం ప్రతి స్త్రీకి ఉన్నది.’ అని జాన్వీకపూర్ అన్నారు. ఈ వీడియోను బాలీవుడ్ అగ్ర నటి ప్రియాంక చోప్రా షేర్ చేసి ‘ఇలా మాట్లాడేవారిని కూడా ప్రోత్సహించాలి..’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతున్నది.