Priyamani | పెండ్లయిన తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది హీరోయిన్ ప్రియమణి. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తాజా బ్లాక్ బస్టర్ ‘జవాన్’. ఇందులో నటి ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించారు ప్రియమణి . ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారామె.
బాలీవుడ్ నటుల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ప్రియమణి. ”బాలీవుడ్ నటుల్లో ఎవరి స్టయిల్ వారిదే. నాకు చాలా మంది నటులు ఇష్టం. కొన్ని అభిమాన పాత్రలు కూడా ఉన్నాయి. ఐతే నాకు క్రష్ ఉన్న ఏకైక వ్యక్తి షారుఖ్ ఖాన్. లక్కీగా షారుక్ తో వర్క్ చేసే అవకాశం రావడం చాలా అనందంగా వుంది. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయాలని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు ప్రియమణి.