Balagam Trailer | పల్లెటూరు నేపథ్యంలో ప్రియదర్శి బలగం ట్రైలర్
ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ (Balagam Trailer)ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు.
Balagam Trailer | స్పెషల్ కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని అందించే నటుడు ప్రియదర్శి (Priyadarshi). మల్లేశం సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బలగం’. కావ్యా కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ (Balagam Trailer)ను విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు. తెలంగాణలోని పల్లెటూరి చుట్టూ తిరిగే కథాంశంతో బలగం ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు దర్శకుడు. ట్రైలర్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ లవ్ ట్రాక్, పెళ్లి.. ఇతర అంశాల చుట్టూ తిరుగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 3న థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధుత్వాలు, సమస్యల మూలాలను గుర్తు చేసేలా సాగుతున్న బలగం ట్రైలర్‌ను లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం ప్రియదర్శి, వేణు, దిల్ రాజు టీంకు మంచి సక్సెస్ అందించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.
బలగం ట్రైలర్..
Happy to launch the trailer of #Balagam – A film that is rooted in our native culture, their towns, their relationships and their problems.
Wishing @priyadarshi_i @OfflVenu @DilRajuProdctns and the entire team all the very best 🤗#BalagamonMarch3rdhttps://t.co/rP73Zs1Fow
— Vijay Deverakonda (@TheDeverakonda) February 27, 2023
Read Also :
Samajavaragamana | సామజవరగమన అంటోన్న శ్రీవిష్ణు.. నయా అప్డేట్
Rashmika Mandanna | బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా రష్మిక మందన్నా.. ట్రెండింగ్‌లో ఫొటోలు, వీడియో
Chiranjeevi | కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

