ఒరు ఆధార్ లవ్ సినిమాలో కన్నుగీటిన సీన్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier). ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ప్రియా వారియర్. గతేడాది ఇష్క్..నాట్ ఏ లవ్ స్టోరీ, చెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పలుకరించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి.
ప్రస్తుతం కన్నడలో ఒక సినిమాతోపాటు హిందీలో మూడు, మలయాళంలో మూడు ప్రాజెక్టులు ప్రియా వారియర్ ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ భామకు మొదటి సినిమా మినహా పెద్దగా హిట్స్ ఏం లేవు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా భారీ క్రేజ్ ఉన్న చిత్రాలేవి కావు. ఇక ప్రియా వారియర్‌కు మలయాళంలో కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రియా వారియర్ సరైన ఆఫర్లు లేకపోవడంతోనే గ్లామర్ డోస్ పెంచినట్టు నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోలతో అర్థమవుతుంది. ప్రియావారియర్ హిందీలో నటిస్తోన్న శ్రీదేవి బంగ్లా, 3 మంకీస్, లవ్ హ్యాకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మలయాళ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Read Also : Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
Read Also : O Pari music video | దేవీ శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో అదిరింది..
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!