Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ (Godfather) ట్రైలర్.. గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ తో చిరు అభిమానులకు కావాల్సిన ట్రీట్‌ను అందించేలా సినిమా ఉండబోతుందని చెబుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ (Godfather) . మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ తో చిరు అభిమానులకు కావాల్సిన ట్రీట్‌ను అందించేలా సినిమా ఉండబోతుందని చెబుతోంది. అయితే గాడ్ ఫాదర్ ట్రైలర్‌కు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) వాయిస్ ఓవర్ అందించాడని తెలిసిందే.
పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో పూరీ జర్నలిస్టుగా, యూట్యూబ్ ఛానల్ యాంకర్‌గా కనిపించనున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ట్రైలర్ లో మాత్రం వాయిస్ ఓవర్‌తో సరిపెట్టేశాడు. ఇంతకీ సినిమాలో కనిపిస్తాడా..అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే పూరీ, చిరు కాంబినేషన్లో ఇప్పటికే ఓ సినిమా తెరకెక్కాల్సి ఉండగా..ఏ ప్రాజెక్టు కూడా తెరరూపం దాల్చలేదు.
పూరీకి చిరు ఫుల్ లెంగ్త్ సినిమా దర్శకత్వం వహించే అవకాశం ఎప్పుడిస్తాడోనని ఆసక్తికరంగా చర్చించుకుంటూనే ఉన్నారు సినీ జనాలు. అయితే ఇపుడు గాడ్ ఫాదర్ కు వాయిస్ ఓవర్ అందించడంతో ఇంప్రెస్ అవుతున్న మూవీ లవర్స్, అభిమానులు..ఇకనైనా డైరెక్టర్‌గా మీతో సినిమా చేసేందుకు పూరీ జగన్నాథ్‌కు అవకాశమివ్వండి..అంటూ చిరంజీవికి తెగ రిక్వెస్టులు పెడుతున్నారు.
చిరు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక అయినా పూరీ-చిరు కాంబోలో సినిమా వస్తుందా..? అనేది చూడాలి.
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్‌గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
Read Also : Tiger Nageswara Rao | రేణూ దేశాయ్ ‘హేమలత లవణం’ పవర్ఫుల్ ఎంట్రీ..వీడియో అదిరింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

