టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరోహీరోయిన్ల లిప్ లాక్ సీన్‌తో మొదలైంది టీజర్. అనూ, శిరీష్ మధ్య ఫన్, సీరియస్, రొమాంటిక్ ట్రాక్‌తో సినిమా సాగనున్నట్టు తెలిసిపోతుంది.
రాకేశ్ శశి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ కీ రోల్స్ పోషిస్తున్నారు.ధీరజ్ మొగిలినేని-విజయ్ ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచు జమని-అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.