టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). ఈ రాక్ స్టార్ కంపోజ్ చేసిన నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో నేడు లాంఛ్ అయింది. డీఎస్పీ మ్యూజిక్ వీడియోను బాలీవుడ్ స్టార్ హీరో రన్ వీర్ సింగ్ లాంఛ్ చేశాడు.
ఓ పరి టైటిల్ (O Pari music video)తో సాగే ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయడమే కాకుండా స్వయంగా పాడాడు. పాన్ ఇండియా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా పాట కంపోజ్ చేశాడు. ఈ పాన్ ఇండియా మ్యూజిక్ వీడియోను కేవలం హిందీలో మాత్రమే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడట డీఎస్పీ. కానీ మ్యూజిక్ వీడియోను తెరకెక్కించిన టీ సిరీస్ మాత్రం ఈ పాటను దక్షిణాది ప్రధాన భాషలన్నింటిలో విడుదల చేయాలనుకుంటుందట.
దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ యువ సంగీత దర్శకుడి జాబితాలో వాల్తేరు వీరయ్య, పుష్ప..ది రూల్ చిత్రాలున్నాయి.
మ్యూజిక్ వీడియోపై ఓ లుక్కేయండి మరి..