Indian 2 | తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. లైకా ప్రోడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 28 ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విషయంలో నేను చాలా ట్రోల్ అయ్యాయని తెలిపింది. తమిళ నటి ప్రియ భవానీ శంకర్.
ప్రియ భవానీ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నా వల్లనే ఫ్లాప్ అయ్యిందని.. తన నటనపై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయని చెప్పుకోచ్చింది.
భారతీయుడు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తాను ఆనందంతో ఎగిరి గంతేశానని.. ఆ సినిమా వల్లనే చాలా మూవీలల్లో నాకు ఆఫర్లు వచ్చినట్లు చెప్పుకోచ్చింది. అయితే సినిమా విడుదల కాకముందే ఫ్లాప్ అని తెలిస్తే.. ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు. కానీ ఒక్కోసారి రిజల్ట్స్ మన చేతుల్లో ఉండవు. అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఒకవేళ భారతీయుడు హిట్ అవ్వదు అని ముందే తెలిసిన నేను అందులో నటించేదాన్ని. కమల్ – శంకర్ సార్ కాంబినేషనల్ వస్తున్న మూవీలో ఛాన్స్ ఎవరు వదులుకుంటారు. అందుకే నేను ఆ సినిమాను చేశాను. కానీ ఈ సినిమా నా వల్లనే ఫ్లాప్ అయ్యిందంటూ నన్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది. మీ అంచనాలను అందుకోలేనందుకు క్షమించండి అంటూ ప్రియా చెప్పుకోచ్చింది.
Also Read..
IND vs SL | తిప్పేసిన పరాగ్.. ఫెర్నాండో సెంచరీ మిస్.. భారత్ లక్ష్యం..?
Kaleswaram | కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ది దుష్ప్రచారం : వేముల ప్రశాంత్‌రెడ్డి