ఈ ఏడాది శతజయంతి జరుపుకున్న భారతీయ సినీ దిగ్గజం, తెలుగుతేజం నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన కళారంగానికి చేసిన సేవల గురించి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు. అక్కినేని తన కృషితో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టారని ఆయన కొనియాడారు. భారతీయ సంస్కృతి, వారసత్వ విలువలు ఆయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని మోదీ గుర్తుచేసుకున్నారు. ఇదిలావుంటే.. ‘భారతరత్న’ మినహా దేశంలోని అత్యుత్తమ పురస్కాలన్నింటినీ అందుకున్న ఘనత అక్కినేనిది. మన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని ప్రస్తావనని ప్రధాని తీసుకురావడంతో అక్కినేనికి భారతరత్న కూడా ప్రకటిస్తారనే ఊహాగానాలు అభిమానుల్ల్లో వినిపిస్తున్నాయి.