Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) చేతిలో రెండు సినిమాలున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో నటిస్తోన్న ది గోట్ (The GREATEST OF ALL TIME). కాగా షూటింగ్ దశలో ఉంది. విజయ్ నటిస్తోన్న మరో సినిమా దళపతి 69 (Thalapathy 69). హెచ్ వినోథ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందంటూ ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుందన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం మమితా బైజును సంప్రదించాడట వినోథ్. మరి క్రేజీ వార్తపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారా..? అనేది చూడాల్సి ఉంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది.
విజయ్ పొలిటికల్ కెరీర్‌పై దృష్టిసారించనున్న నేపథ్యంలో ఇదే చివరి సినిమా కానుందని ఇప్పటికే న్యూస్ తెరపైకి వచ్చింది. విజయ్ పొలిటికల్ కెరీర్ ప్లాన్‌కు కలిసొచ్చేలా కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచేపోయేలా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఇక విజయ్ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తోన్న The GOATలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Xclusive – #Thalapathy69
– Malayalam Actor’s #MamithaBaiju On Board ✔️
– She will be playing an important role in this film
– This is Thalapathy’s last film
– This film is directed by #HVinoth
– This film is produced by KVN. #Anirudh is going to compose music for this film.… pic.twitter.com/mvEOVpHh8M— Movie Tamil (@MovieTamil4) August 4, 2024
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Kalki 2898 AD | గెట్ రెడీ.. ఇక రూ.100కే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూసే అవకాశం