Premalu Girls | మలయాళ రొమాంటిక్ డ్రామా ప్రేమలు (Premalu) సినిమాతో దక్షిణాదిన సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు మమితా బైజు, అఖిల భార్గవన్ (Akhila Bhargavan) . ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీగా అయిపోపోయారు. మమితా, అఖిల ప్రస్తుతం మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు భామలు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఒక్క చోట కలిసి సందడి చేశారు.
మమితా, అఖిల రీయూనియన్‌కు సంబంధించిన స్టిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మేం మళ్లీ కలిశాం. మమితా బైజు (Mamitha Baiju) ఐ లవ్ యూ అంటూ సరదాగా చిల్ అవుతూ దిగిన సెల్ఫీ, ఫొటోలను అఖిల భార్గవన్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఏదైనా సినిమాలో నటిస్తున్నారా..? ఇద్దరి మీటింగ్ వెనుక సీక్రెట్ ఏమైనా ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్.
మమితా బైజు ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తోన్న జననాయగన్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అఖిల భార్గవన్ ఇటీవలే నజ్రియా నజీమ్ నటించిన మలయాళ డ్రామా సూక్ష్మదర్శినిలో కీలక పాత్ర పోషించింది. అఖిల భార్గవన్ నెక్ట్స్ Sumathi Valavu సినిమాలో నటిస్తోంది.
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్