NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ ఇది పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా ఎప్పుడు అప్డేట్లు వస్తాయా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ని పంచుకుంది దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో రాసుకోస్తూ.. వైట్ బోర్డు బయటకు వచ్చిందంటే ఆయన స్క్రిప్ట్ వర్క్ పూర్తి స్థాయిలో జరుగుతుందని మాకు తెలుసని అర్థం. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపింది. దీనికి రేరింగ్టురోర్, వర్క్ఫ్రమ్హోం అనే హ్యాష్ట్యాగ్స్లను లిఖిత రెడ్డి జత చేసింది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
Raring To Roar @tarak9999 #PrashanthNeel 💥💥💥💥. #NTRNeel pic.twitter.com/0elxB6VAvv
— NTR Fans (@NTR2NTRFans) January 11, 2025