Prashanth Neel | డ్రాగన్‌తో సూపర్ హైప్.. సలార్ 2 పుకార్లపై ప్రశాంత్ నీల్ క్లారిటీ.. !
Prashanth Neel | ప్రశాంత్ నీల్ ఇప్పటికే విడుదల చేసిన డ్రాగన్ స్పెషల్ గ్లింప్స్ నెట్టింట సునామి సృష్టిస్తోంది. తారక్‌ను ఇదివరకెన్నడూ చూడని నయా అవతార్‌లో చూపించబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ లైనప్‌లో ప్రభాస్‌తో చేయబోయే సీక్వెల్ ప్రాజెక్టు సలార్ 2 ఉందని తెలిసిందే. ప్రస్తుతం తాను డ్రాగన్‌పైనే ఫోకస్ పెట్టానని ప్రశాంత్ నీల్ చెప్పగా.. డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ మరో స్టాండలోన్ సినిమాపై పనిచేయనున్నాడని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.
Prashanth Neel | కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్, గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు ప్రశాంత్ నీల్. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా చేస్తున్నానడి తెలిసింది. ఇప్పటికే విడుదల చేసిన బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ నెట్టింట సునామి సృష్టిస్తోంది. తారక్‌ను ఇదివరకెన్నడూ చూడని నయా అవతార్‌లో చూపించబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ లైనప్‌లో ప్రభాస్‌తో చేయబోయే సీక్వెల్ ప్రాజెక్టు సలార్ 2 ఉందని తెలిసిందే.
ప్రస్తుతం తాను డ్రాగన్‌పైనే ఫోకస్ పెట్టానని ప్రశాంత్ నీల్ చెప్పగా.. డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ మరో స్టాండలోన్ సినిమాపై పనిచేయనున్నాడని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై తాజాగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు. డ్రాగన్ తర్వాత తాను సలార్ 2పై పనిచేయనున్నట్టు చెప్పాడు. సలార్ 2 కూడా సెట్స్‌పైనే ఉందని డ్రాగన్ తర్వాత తప్పకుండా ఈ సినిమాకు పనిచేయడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల్ తొలిసారి తెలుగు హీరోల్లో ప్రభాస్‌తో కలిసి సలార్ సినిమా చేయడంతో ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఇక ఇప్పటికే పూర్తి కావాల్సిన సలార్ 2ను డ్రాగన్ సినిమా కారణంగా ముందుకు నెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో యశ్‌తో చేయబోయే కేజీఎఫ్ 3 సినిమాపై కూడా ప్రేక్షకుల్లో డైలామా నెలకొంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రశాంత్ నీల్ మైథలాజికల్ సబ్జెక్టుపై పనిచేసేందుకు రెడీ అవుతున్నాడని.. యాక్షన్ జోనర్ నుంచి త్వరలోనే బయటకు రాబోతున్నాడంటూ వార్తలు కూడా ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
ఆ తర్వాత, డెవిల్ పుట్టింది.. మా లూగర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సినిమా వేడుకను అందించేందుకు డ్రాగన్ జూన్ 11, 2027న హద్దులు దాటబోతుంది. . అంటూ షేర్ చేసిన నయా లుక్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Also :
Bandla Ganesh | మళ్లీ పవన్ కళ్యాణ్‌కి దగ్గరైన బండ్ల గణేష్ .. ‘మెగా 158’ వేదికపై వైరల్ అయిన సన్నివేశాలు
Padma Devender Reddy | రైతులు చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
Tamil Nadu | తమిళనాడులో మంత్రివర్గ విస్తరణ.. 23 మందికి మంత్రివర్గంలో చోటు.. ఇద్దరు కాంగ్రెస్ నుంచి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

