e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సినిమా పెళ్లిపీటలెక్కిన ప్రణీత

పెళ్లిపీటలెక్కిన ప్రణీత

పెళ్లిపీటలెక్కిన ప్రణీత


కన్నడ సోయగం ప్రణీత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌రాజును ఆమె పెళ్లాడింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆదివారం నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. వివాహబంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నానని, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పెళ్లికి సంబంధించిన వార్తను ముందుగా ఎవరితో పంచుకోలేకపోయానని ప్రణీత తెలిపింది. ‘ప్రస్తుతమున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెళ్లి తేదీ విషయంలో మేమంతా సందిగ్ధంలో ఉండిపోయాం. అందువల్లే ముందుగా ఎవరికీ చెప్పలేకపోయాం. నన్ను ప్రేమించే చాలా మంది ఈ వేడుకలో భాగం కానందుకు నేనుఎంతగానో బాధపడుతున్నా. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత అందరం కలిసి వేడుక చేసుకుందాం’ అంటూ ప్రణీత ఓ ప్రకటనను విడుదలచేసింది. ప్రణీత, నితిన్‌రాజు వివాహ వేడుకకు సంబంధించి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగులో ‘అత్తారింటికి దారేది’తో పాటు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించింది ప్రణీత.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెళ్లిపీటలెక్కిన ప్రణీత

ట్రెండింగ్‌

Advertisement