ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రకాశ్ రాజ్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి అండగా ఉన్న ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ఫ్యామిలీకి ఉపాధి కల్పించేందుకు జేసేబీని అందించారు. మైసూర్‌లోని శ్రీరంగపట్నకు చెందిన ఓ ఫ్యామిలీ ఉపాధి లేక కొన్నాళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ తన ఫౌండేషన్ ద్వారా జేసీబీని కొనిచ్చారు. ‘ఒక జీవితంలో వెలుగును నింపేందుకు.. మనం సంపాదించింది తిరిగి ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ సినిమాలతో బిజీగా ఉంటూనే మా అధ్యక్ష బరిలో నిలిచారు. అక్టోబర్ 10న జరగనున్న ఎన్నికలలో విష్ణుతో ప్రకాశ్ రాజ్ పోటీ హోరా హోరీగా ఉండనుంది. ప్రకాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ అండగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన తనకు పోటీగా నిలిచిన జీవిత, హేమలను తన ప్యానెల్లోకి తీసుకొని పోటీని తగ్గించుకున్నారు. ఇటీవల మా ప్యానెల్ సభ్యులతో కలిసి పలు మీటింగ్‌లు కూడా ఏర్పాటు చేశాడు. పలు విషయాల గురించి ముచ్చటించి హామీలు కూడా ఇచ్చారు.
Empowering a family with a JCB near srirangapatna.. Mysore. a #prakashrajfoundation initiative.. The joy of giving back to life .. bliss pic.twitter.com/Y4r8Qwp1lp
— Prakash Raj (@prakashraaj) September 13, 2021