Love Insurance Kompany | తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు ప్రదీప్ రంగనాథన్. గతేడాది లవ్‌టుడే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ యాక్టర్ ఇప్పటికే డ్రాగన్ , డ్యూడ్ సినిమాలతో మంచి హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న చిత్రం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ(Love Insurance Kompany). ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ఎవరూ ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడ్డది. మూవీ త్వరలోనే విడుదల కానుందని యూఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే కొత్త తేదీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.
తాజా టాక్ ప్రకారం ఈ మూవీని వాలెంటైన్ వీక్‌లో (ఫిబ్రవరి, 2026) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై ఎస్ ఎస్ లలిత్ కుమార్‌తో కలిసి నయనతార నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో భవిష్యత్‌లో(2040) ప్రేమ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుందని హింట్ ఇచ్చారు విఘ్నేశ్ శివన్ టీం.
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్