Prabhas | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం జపాన్‌లో బాహుబలి : ది ఎపిక్ స్పెషల్ ప్రీమియర్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ గురువారం జపాన్‌కు వెళ్లాడు. ఈవెంట్‌కు బాహుబలి ప్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరు కానున్నారు.
బాహుబలి : ది ఎపిక్ జపాన్‌లో 2025 డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ డిసెంబర్ 5, 6వ తేదీల్లో స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ టైంలో జపాన్‌లో తాను కలవలేకపోయిన అభిమానులను కలుస్తానని హామీనిచ్చాడని తెలిసిందే. వారికిచ్చిన మాట ప్రకారం రేపు జపాన్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేయనున్నాడు.
ఇదిలా ఉంటే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్, తృప్తి డిమ్రిపై వచ్చే కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవలే షూట్ చేశారు. షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న ప్రభాస్ జపాన్ టూర్ అయిపోగానే మళ్లీ స్పిరిట్ షూట్‌తో బిజీగా కానున్నాడు.
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ (Raja saab) వస్తుందని తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా లాంచ్ చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది.
#Prabhas Reached #Japan Today.
Rarely Prabhas appears in public, Now Japanese Prabhas fans are the most happiest. #BaahubaliTheEpic #Baahubali pic.twitter.com/9XiHbrGwq3
— Film Loop (@filmloop123) December 4, 2025
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్?