ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే హీరో సినిమాలు రెండుమూడు సెట్స్‌పై ఉంటే.. షెడ్యూల్ ప్లానింగ్‌లో ఇబ్బందులు తప్పవ్. ఒకప్పటి మేకింగ్ ైస్టెల్ వేరు. ఇప్పటి మేకింగ్ ైస్టెల్ వేరు. దాంతో హీరో డేట్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఓ పాన్ ప్రకారం షెడ్యూల్ వేసుకోవాల్సిన పరిస్థితి. అసలు విషయం ఏంటంటే.. డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాను సెప్టెంబర్ నుంచి లైన్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం, ఒకసారి ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్లోకి ఎంటరైతే ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమాకు పనిచేసే పరిస్థితి లేదు. ప్రభాస్ ఇప్పటికే ‘ది రాజాసాబ్’ సినిమాను దాదాపు పూర్తి చేసేశారు. ఇక ‘ఫౌజీ’ సినిమా 50శాతం మాత్రమే పూర్తయింది.
ఈ సినిమాను పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభాస్‌పై ఉంది. కానీ ఆయన ‘స్పిరిట్’ సెట్లోకి ఎంట్రీ ఇచ్చాడంటే.. ‘ఫౌజీ’ని కొన్నాళ్లు పక్కన పెట్టినట్టే. అందుకే.. ప్రభాస్‌కి ఇబ్బంది లేకుండా సందీప్‌రెడ్డి వంగా పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ నుంచి అనుకున్నట్టే ‘స్పిరిట్’ షూటింగ్‌ని ఆయన మొదలుపెడుతున్నారు.
రెండుమూడు నెలలు పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేని సీన్స్‌ని సందీప్ షూట్ చేస్తారట. ఈలోపు ‘ఫౌజీ’ని కంప్లీట్ చేసి, ఈ ఏడాది చివరికి ‘స్పిరిట్’ సెట్లోకి ప్రభాస్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తున్నది. ఏదేమైనా విరామం లేకుండా షూటింగ్‌లు చేస్తూ సాటి హీరోలకు ప్రేరణగా నిలుస్తున్నారు ప్రభాస్.