Chatrapathi Movie – Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఛత్రపతి సినిమా ఒకటి. అప్పటివరకు క్లాస్ సినిమాలకు పరిమితం అయిన ప్రభాస్‌ను ఛత్రపతి ఒక్కసారిగా మాస్ హీరోను చేసింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
అయితే ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది ఇంటర్వెల్ సీన్ అన్న విషయం తెలిసిందే. బాజీరావును చంపిన అనంతరం అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు)కు వార్నింగ్ ఇస్తాడు. ఒక్క అడుగు.. ఒక్క అడుగు అంటూ విశాఖ మ్యాప్‌పై కాలు వేసి ప్రభాస్ డైలాగ్ చెప్పడంతో థియేటర్లన్ని దద్దరిల్లిపోయాయి. అయితే ఈ సన్నివేశం అనంతరం ప్రభాస్ బయటకు వచ్చి వర్షంలో ప్రజలతో మాట్లాడే సీన్ ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది. అయితే ఈ సన్నివేశంలో ప్రభాస్ అసలు డైలాగ్ చెప్పకుండా పెదవులు మాత్రమే కదిలించినట్లు తాజాగా వెల్లడించాడు. వర్షంలో డైలాగ్ గట్టిగా చెప్పలేను పెదవులు మాత్రమే కదిలిస్తాను అని ప్రభాస్ చెప్పడంతో రాజమౌళి కూడా ఒకే చెప్పినట్లు తెలిపాడు.
Also Read..