Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) లాంగ్ గ్యాప్ తర్వాత కామిక్ టైమింగ్ ఉన్న రోల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాజాసాబ్ (Raja Saab). మారుతి (Maruthi) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ హార్రర్ కామెడీ జోనర్లో వస్తోంది. ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ తెరపైకి వచ్చింది. రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ప్రభాస్ అండ్ హీరోయిన్లపై ఫన్ రైడ్‌గా సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తు్న్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించనుండగా.. మారుతి ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి తన రేంజ్ చాటాలని చూస్తున్నాడు.
ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతున్న విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్