టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. మేకర్స్ ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో 19వ శతాబ్దపు కాలం నాటి స్పెషల్ సెట్ వేశారని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మొదలైన కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో విదేశీ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్, పలువురు నటీనటులు పాల్గొనబోతున్నారట.
మారుతి టీం 40 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసింది. అయితే బాహుబలి స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు అప్డేట్ వచ్చినప్పటి నుంచి.. ఆయన డైరెక్షన్లో సినిమా చేయొద్దంటూ కొందరు అభిమానులు, నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్ నేపథ్యంలో మారుతి సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకుండా కొంచెం సీక్రెట్‌గానే షూటింగ్ కొనసాగిస్తున్నాడన్న టాక్ కూడా ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది.
మారుతి త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్‌ను కూడా ప్రకటిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. మొత్తానికి ఏదేమైనా ప్రభాస్ మాత్రం ఈ హార్రర్ కామెడీని త్వరలోనే పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇతర సినిమాల షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా.. ప్రభాస్ డేట్స్ కు అనుగుణంగా సినిమా షూటింగ్ చేస్తున్నాడట మారుతి. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K చేస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ చిత్రాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి.
Mahesh Babu | మహేశ్‌బాబు మరో వెకేషన్.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ సంగతేంటి..!
Nani 30 | స్పీడుమీదున్న నాని.. నాని 30 షూటింగ్‌పై తాజా అప్డేట్
Rahul Dev | అందుకే సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి : రాహుల్ దేవ్