అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్’ సెప్టెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ సినిమా తాలూకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ తొలివారంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే షూటింగ్ తుదిదశకు చేరుకుందని, మరో రెండు నెలల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని సమాచారం. స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. మిథున్చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇదిలా ఉండగా ‘స్పిరిట్’ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ ‘సలార్-2’ ‘కల్కి-2’ చిత్రాలపై దృష్టిపెడతారని అంటున్నారు. వీటితో పాటు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస్’ సినిమా కూడా ప్రభాస్ లైనప్‌లో ఉంది