సోషల్ మీడియాలో ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ.. నెటిజన్లకు నిద్రపట్టకుండా చేసే అందాల భామల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది మాళవికా మోహనన్ (Malavika Mohanan). ఈ కేరళ కుట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్-మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ బ్యూటీ మరో క్రేజీ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ క్రేజీ మూవీ ఏంటనే కదా మీ డౌటు.. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుండగా.. శ్రీలీల మరో హీరోయిన్గా కనిపించనుందట. దీనికి సంబంధించి మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని ఇన్సైడ్ టాక్. ఈ వార్త ప్రస్తుతానికి గాసిప్‌గానే ఉన్నా .. అభిమానులు మాత్రం మాళవికా మోహనన్‌ను పవన్ కళ్యాణ్ పక్కన ఊహించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో ఇప్పటికే భారీ సెట్ వేశారు. ఇటీవలే సెట్‌ను హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ అయానంక బోస్, ఆనంద్ సాయి పరిశీలిస్తున్న ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్‌కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజా టాక్ ప్రకారం పవన్ కల్యాణ్ ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. పవన్ కల్యాణ్ మరోవైపు క్రిష్ డైరెక్షన్లో హరిహరవీరమల్లుతోపాటు సుజిత్ దర్శకత్వంలో OG ప్రాజెక్ట్‌లను కూడా చేస్తున్నాడని తెలిసిందే.
Read Also :
Faria Abdullah | రావణాసురలో లాయర్ కనక మహాలక్ష్మిగా కనిపిస్తా : ఫరియా అబ్దుల్లా
Thrinadha Rao Nakkina | కొత్త సినిమాకు చెక్ అందుకున్న ధమాకా డైరెక్టర్.. ఇంతకీ హీరో ఎవరో..?
Anni Manchi Sakunamule | ఫీల్ గుడ్ థీమ్‌తో అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్