ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఓ పసికందు మరణించింది. చిన్నపిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వార్డులోని చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. వార్డులో సుమారు 30 మంది చిన్నారులు ఉండగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన ఐదు రోజుల చిన్నారి మృతి చెందింది.