Faria Abdullah | రావణాసురలో లాయర్ కనక మహాలక్ష్మిగా కనిపిస్తా : ఫరియా అబ్దుల్లా
టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం రావణాసుర (Ravanasura). హైదరాబాదీ ముద్దుగుమ్మ, జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మీడియాతో చిట్ చాట్ చేసింది.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హైదరాబాదీ ముద్దుగుమ్మ, జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానున్న నేపథ్యంలో రవితేజతోపాటు హీరోయిన్లు, డైరెక్టర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మీడియాతో చిట్ చాట్ చేసింది.
రావణాసుర గురించి ఫరియా అబ్దుల్లా మాటల్లోనే..
కథ విన్నపుడు మీ రియాక్షన్..?
రైటర్ శ్రీకాంత్ కథ వినిపించినప్పుడు ఎక్జయిటింగ్‌గా అనిపించింది. సినిమాలో తనకు ఏం కావాలో డైరెక్టర్ సుధీర్ వర్మ క్లారిటీగా చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది..?
రావణాసురలో లాయర్ కనక మహాలక్ష్మి పాత్రలో నటించా. అయితే జాతిరత్నాలు లాంటి పాత్ర కాదు. కనకమహాలక్ష్మి సీరియస్ లాయర్.. రవితేజ నా సీనియర్ లాయర్‌గా కనిపిస్తారు. నా రోల్లో చాలా పార్శ్వాలుంటాయి.. సినిమా లైన్‌కు అనుగుణంగా నా పాత్ర మారుతుంటుంది.
సినిమాలో ఐదుగురు హీరోయిన్లున్నారు.. వారితో మీ కాంబినేషన్ సీన్లుంటాయా..?
నేను కేవలం మేఘా ఆకాశ్‌తో మాత్రమే కలిసి కనిపిస్తాను. సినిమాలో ఐదుగురు హీరోయిన్లు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. రావణాసురలో నా పాత్రలో నటనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది.
రవితేజతో పనిచేయడం ఎలా ఉంది..?
ఓ యాక్టర్‌గా మాత్రమే కాదు.. వ్యక్తిగా కూడా రవితేజ స్ఫూర్తిగా నిలుస్తారు. షాట్ గ్యాప్‌లో రవితేజతో మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆయనతో పనిచేయడం అద్భుతంగా అనిపించింది.
చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయడానికి కారణం..?
తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. నేనేం చేయాలో క్లారిటీ ఉంది. నేను రాబోయే ఐదేళ్లలో ఏ స్థాయిలో ఉంటానో నాకు తెలుసు. సినిమాల ఎంపిక విషయంలో తొందరపడాలనుకోవడం లేదు. నాకు అవకాశాలు వస్తాయా..? రావా..? అని బాధపడను.
లాయర్ పాత్ర కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు..?
సినిమాలో కోర్టు సీన్లు తక్కువగా ఉంటాయి. అయితే లాయర్ బ్యాక్ డ్రాప్‌కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కనకమహాలక్ష్మి పెళ్లయిన మహిళ.. ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. పాత్రకు తగ్గట్టుగా మైండ్‌సెట్ కూడా కాస్త భిన్నంగా ఉండాలి. పాత్రకు అనుగుణంగా మార్చుకోవాల్సి వచ్చింది.
మీ కొత్త సినిమాల మాటేంటి..?
ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
See Also :
Faria Abdullah | ఫరియా అబ్దుల్లా రావణాసుర మూవీ ఇంటర్వ్యూ స్టిల్స్…
Read Also :
Thrinadha Rao Nakkina | కొత్త సినిమాకు చెక్ అందుకున్న ధమాకా డైరెక్టర్.. ఇంతకీ హీరో ఎవరో..?
Anni Manchi Sakunamule | ఫీల్ గుడ్ థీమ్‌తో అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

