Prabhas | ఆమె బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. తనని ఎప్పటికీ అభిమానిస్తా : ప్రభాస్
Prabhas | సహ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కొనియాడారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). ఆమెను ఎప్పటికీ అభిమానిస్తా అని అన్నారు .
Prabhas | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సైన్స్ ఫిక్షన్ జోనర్లో నటిస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) ముఖ్య పాత్రలో నటిస్తోంది. కాగా, తాజాగా ప్రభాస్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘కల్కి’ విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో దీపికపై ప్రశ్న ఎదురవగా.. ఆమెపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు.
దీపిక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కొనియాడారు. ఆమె అంటే ఎప్పటికీ తనకు అభిమానమేనని చెప్పుకొచ్చారు. ‘దీపిక చాలా అందమైన, అద్భుతమైన నటి. ఇప్పటికే ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. నేను తనని ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. దీపికతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఈ చిత్రంతో కుదిరింది. ‘కల్కి’ సెట్స్‌లోకి ఆమె అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోనూ ఉత్సాహం వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొణె , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్ర టైటిల్ ను ఇటీవలే అమెరికాలోని ‘శాన్ డియాగో కామిక్ కాన్’లో కల్కి 2898 ఏడీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Rashmika Mandanna | అతడితో నాకు ఎప్పుడో పెళ్లైపోయింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్
Beijing | 140 ఏళ్ల రికార్డు బద్దలు.. జల ప్రళయంతో విలవిల్లాడుతున్న బీజింగ్
Seema Haider | సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్..? మర్డర్ స్టోరీకి ఆడిషన్స్ ఇచ్చిన పాక్ మహిళ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

