Raja Saab | టాలీవుడ్ దర్శకుడు మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబోలో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కారు రూఫ్‌టాప్‌పై స్టైలిష్‌గా కూర్చున్న రాజాసాబ్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్న స్టిల్ ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఇప్పటికే రాజాసాబ్ ట్రైలర్‌ను లాంచ్ చేయగా.. కామెడీ, లవ్, రొమాన్స్, హార్రర్ లాంటి ఎలిమెంట్స్‌తో మారుతి మార్క్ కామెడీ టచ్‌తో సినిమా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు. మేకర్స్ చాలా రోజుల క్రితం రాజాసాబ్ గ్లింప్స్ లాంచ్ చేశారని తెలిసిందే. గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు.
ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.
There’s style.
There’s swagger
and there’s that Rebel Madness that lights up everything 🔥Nothing can ever match the high and celebration you bring 🙏🏻#TheRajaSaab First Single will be a limitless wave of celebration for every fan 💯 #Prabhas #TheRajaSaabOnJan9th… pic.twitter.com/5hpVJqJASR
— BA Raju’s Team (@baraju_SuperHit) October 23, 2025
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు