prabhas adipurush | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్..శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. సీత పాత్రధారిణిగా కృతిసనన్ కనిపించనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్‌తో త్రీడీ సాంకేతికతతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చిత్రీకరణను కేవలం 103రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర బృందం ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. “ఆదిపురుష్’ చిత్రీకరణ పూర్తయింది. ఓ అద్భుతమైన ప్రయాణం ముగింపునకు చేరుకుంది. తెరపై మేం సృష్టించిన ఇంద్రజాలాన్ని మీరు వీక్షించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఓ ఫొటోను కూడా పంచుకున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు లంకేశ్ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పోషించారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు సంబంధించిన లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నారని తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Prabhas: తెలుసుకోకపోతే ఎలా.. సన్నీ సింగ్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Prabhas: ప్రభాస్‌కి సిగ్గు ఎక్కువ.. వీలున్నప్పుడల్లా డిన్నర్ పార్టీ ఇస్తాడన్న కృతి
అమ్మో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెట్టారా?
Prabahs: ప్రభాస్ ఫ్యామిలీ ఇంత పెద్దదా.. వైరల్‌గా మారిన పిక్