అమ్మో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెట్టారా?

radhe shyam climax | బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రశాంత్ నీల్‌తో సలార్ ( Salaar ), ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ( adipurush ) సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తి కాగానే నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ కే అనే పీరియాడికల్ సినిమాలో నటించనున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ( Spirit ) అనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. ఇవే కాకుండా దిల్ రాజుతో ఒక సినిమా, ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో రెండు మూడేండ్లు ప్రభాస్ బిజీగా గడపబోతున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ బర్త్ డే దగ్గరికి వస్తుండటంతో రాధే శ్యామ్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది.
ప్రభాస్, పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుక వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1975 బ్యాక్‌డ్రాప్‌లో యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా ప్రచార చిత్రాలను సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాధే శ్యామ్ సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలెట్‌గా ఉంటుందట. 15 నిమిషాల నిడివితో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడంట దర్శకుడు. ఈ సీన్ కోసం నిర్మాతలు దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Radhe shyam climax | రాధేశ్యామ్ క్లైమాక్స్ సీన్ ఏంటో తెలిసిపోయింది..!
Pooja Hegde: పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ నిర్మాతలు విసిగిపోతున్నారా..!
ఎయిర్టెల్ బ్యూటీకి ప్రభాస్ సినిమాలో ఛాన్స్..!
గ్లామర్ డోస్ పెంచిన పూజా హెగ్డే.. పొట్టి నిక్కరులో రచ్చ
Prabhas ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మూడు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు
మొన్న ప్రభాస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. కొడుకు కోసం పూరీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?
Prabhas 25 | ఏంటబ్బా ప్రభాస్ కాన్ఫిడెన్స్.. ఇలా చేస్తున్నాడేంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

