HBD pawan kalyan | మొన్న ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు ఎలా జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఒకే రోజు నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మెగాస్టార్. తాను చేయబోయే నాలుగు సినిమాలు.. వాటి షూటింగ్స్ అన్ని వివరాలు చెప్పాడు. దాంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును దానికి మించి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. దాంతో వాటి ఫస్ట్ లుక్ లతో పాటు టీజర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అన్నింటి కంటే ముందు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా, పవన్ కళ్యాణ్ హీరోలుగా వస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇక తమన్ మొదటి పాటకు అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2 ఉదయం ఈ పాట విడుదల కానుంది.
క్రిష్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా మధ్యాహ్నం తర్వాత విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బందిపోటు పాత్రలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపిస్తున్నాడు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది.
హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ సెప్టెంబర్ 2న బయటకు రానుంది. గత ఏడాది పవన్ పుట్టిన రోజున ఒక పోస్టర్ విడుదల చేశాడు హరీష్ శంకర్. ఈ సారి అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన విశేషాలతో సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారనుంది. రాబోయే రెండేళ్లలో పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది కూడా అభిమానులకు ఒక రకంగా పండగ లాంటి వార్తే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
Tollywood | సెప్టెంబర్ 4న వైఎస్ జగన్‌తో సినీ పెద్దల భేటీ..!
బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్