విలువిద్యలో గొప్పపేరు తెచ్చుకోవాలని కలలు కంటాడు పార్ధు. అయితే తాను ఎంతగానో ప్రేమించిన ఆర్చరీ క్రీడను వదిలిపెట్టాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? తన గురిని కోల్పోయిన అతడు తిరిగి ఎలా లక్ష్యాన్ని సాధించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. శుక్రవారం నాయకానాయికల కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో నాగశౌర్య నుదుటిపై ముద్దుపెడుతూ కథానాయిక కేతికశర్మ కనిపిస్తోంది. ‘విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. స్పోర్ట్స్, యాక్షన్, ప్రేమ అంశాలతో విభిన్నంగా ఉంటుంది. నాగశౌర్య పాత్ర శక్తివంతంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి.