Nag Ashwin | కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ టాలెంటెడ్ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేయబోతున్నాడని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. నాగ్ అశ్విన్ ఫీ మేల్ సెంట్రిక్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని ఇప్పటికే క్రేజీ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పాపులర్ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస రావు కథనందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ లీడ్ రోల్లో నటించనుందని పుకార్లు కూడా ఊపందుకున్నాయి.
అయితే ఈ వార్త ఇలా తెరపైకి వచ్చిందో లేదో ఇప్పుడు మరో భామ పేరు వైరల్ అవుతోంది. పాపులర్ మలయాళ హీరోయిన్ నాగ్ అశ్విన్ సినిమాలో లీడ్ రోల్ చేస్తుందని మరో టాపిక్ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో ఉండగా.. ప్రస్తుతానికి వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రభాస్‌తో కల్కి పార్ట్ 2ను కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే.
ఈ క్రేజీ డైరెక్టర్ ఏ ప్రాజెక్టు చేసినా కల్కి పార్ట్ 2ను ముందుగా సెట్స్‌పైకి తీసుకెళ్లిన తర్వాతే మిగితా సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. రాబోయే రోజుల్లో ఫీమేల్ సెంట్రిక్ మూవీపై ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి మరి.
Kotha Lokah | మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ.. ‘కొత్త లోక’ ట్రైలర్ రిలీజ్
Kingdom Movie | ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. ఎక్కడ చూడోచ్చంటే.!