Fauji | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడనే సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ‘ఫౌజీ`(Fauji) ఒకటి. ఇమాన్వీ (Imanvi) హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. కాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే క్రేజీ వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇందులో టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్ ఫౌజీ షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. అయితే ఫౌజీలో రాహుల్ రవీంద్రన్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఫౌజీ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఉండనుందని.. ఇందులో ప్రభాస్ బ్రిటీష్‌వారి సైనికుడిగా కనిపించనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రభాస్ మరోవైపు మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమాలు కూడా చేస్తున్నాడు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు