Paradha | అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘పరదా’(Paradha). మలయాళ నటి దర్శన, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా బండి ఫేం ప్రవీణ్ కాండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్‌ను కూడా విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది.
కాగా ఈ సినిమా మలయాళ వెర్షన్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ మలయాళ థ్రియాట్రికల్ హక్కులను పాపులర్ మాలీవుడ్ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నాడు. హోంబ్యానర్ వేఫరెర్ ఫిలిమ్స్‌లో పరదా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మిస్టికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి. ఎలా ఎదగకుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది.
అనుపమ, దర్శన కేరళ నటీమణులు కావడం.. దుల్కర్ సల్మాన్‌కు కూడా హోం స్టేట్ కావడంతో మలయాళంలో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
. @dulQuer bringing #Paradha in Malayalam to audiences worldwide through @DQsWayfarerFilm 🔥 pic.twitter.com/w6qPXmt5GT
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) January 29, 2025
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!