Poonam Kaur | ఒకప్పటి పాపులర్ నటి పూనమ్ కౌర్ ఇటీవల వివాదాలతో వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటుంది. గతంలో త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్ చేయగా, ఇప్పుడు దానిపై మరోసారి స్పందించి వార్తలలో నిలిచింది .నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను, కాని తర్వాత ఆమెని కలవలేకపోయిను. ఆమె బిజీగా ఉన్నారని, డిస్ట్రబ్ చేయోద్దని చెప్పారు. అందుకే కలవలేకపోయాను.
నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేశాను. రాజకీయ అండదండలతో ఎవరైతే తప్పించుకుంటున్నారో అతడి మీద ఫిర్యాదు చేశాను.. మెయిల్ చేసినట్టుగానే ఉమెన్ టీంతో నేను మాట్లాడతాను.. థాంక్యూ అని పూనమ్ పోస్ట్ వేసింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా ఆమె బయటపెట్టారు. ఈ క్రమంలో మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుని పూనమ్ కలవగా, అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. ఆ ఫొటో చూసి త్రివిక్రమ్‌తో సమస్య సమసిపోయిందని , అందుకే కూటమి ప్రభుత్వంలో పవన్ ఉన్నా కూడా చంద్రబాబుని కలిసింది అని అంతా అనుకున్నారు. కాని ఇప్పడు ఆమె పోస్ట్‌లు చర్చనీయాంశంగా మారాయి.
మలయాళ ఇండస్ట్రీ, మీటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న టైంలోనే పూనమ్ కౌర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా అవకాశాల పేరుతో తనను ఛీట్ చేశారని.. ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారని పూనమ్ పెద్ద ఎత్తునే విమర్శలు చేసింది. మాలో కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. అయితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయంగా తనని ఇబ్బందికి గురి చేశారని, అందుకే అప్పట్లో వదిలేశానని చెప్పింది.