Ravi Prakash – Poonam Kaur | ప్రస్తుతం టాలీవుడ్ అంతా కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంతకు పలువురు మద్దతుగా నిలిచారు.ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, నాని, వెంకటేశ్, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెలతోపాటు పలువురు స్పందించారు.
అయితే ఈ విషయంపై జర్నలిస్ట్ ఆర్టీవి రవిప్రకాశ్ స్పందిస్తూ.. నాకు చాలా సిగ్గుగా ఉంది. తెలుగు సంస్కృతిలో స్త్రీలను గౌరవించడమే అనేది ప్రధానం. కానీ ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే మనం చేయగలిగిందల్లా అవమానంగా భావించడమే. ఒక స్త్రీ అయ్యి ఉండి ఇంకో స్త్రీని అవమానించడం, ఆ తర్వాత ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం. ఇవన్ని చూస్తుంటే.. మనం రాజకీయంగా ఎంత దిగజారామో కనిపిస్తుంది అంటూ రాసుకోచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. రవిప్రకాశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ ప్రోగ్రామ్స్ వలన నా జీవితం ఏం అయ్యింది. మీకేం తెలుసు అని ఒక దళిత బిడ్డను బలి పశువుని చేశారు. మీ రాజకీయ లాభం కోసం చేసింది మర్చిపోయారా అంటూ పూనమ్ రాసుకోచ్చింది.
What did your programs do to my life ? What truth did u know that you made a Dalit a scape goat for political agendas ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 3, 2024