స్టార్స్ అందరికి దాదాపు సొంత ఇళ్లే కాదు వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ వ్యవసాయ క్షేత్రాలలో రకరకాల పంటలతో పాటు మామిడి సాగు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ సమ్మర్ వస్తే తన శ్రేయోభిలాషులకు మామిడి పండ్లను బహుమతిగా అందిస్తారు. ఈ సారి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ..అడివి శేష్‌తో పాటు పలువురు ప్రముఖులకు మ్యాంగోస్ పంపగా, పూజా హెగ్డే మంగళూరులోని తన ఫాం హౌజ్ లోని మామిడి పండ్లను సుశాంత్‌తో పాటు పలువురు ప్రముఖులకు గిఫ్ట్‌గా పంపింది.
అడివి శేష్, సుశాంత్ తమకు అందిన మ్యాంగో బాక్స్‌లను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుశాంత్ అయితే థ్యాంక్యూ సో మచ్ పి అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. వీరిద్దరు కలిసి అల వైకుంఠపురములో చిత్రంలో కలిసి నటించిన విషయం విదితమే.
Thank you @prakashraaj sir and @PonyPrakashraj
— Adivi Sesh (@AdiviSesh) May 16, 2021
for the lovely #Mangoes and #Java Apples 🙏🏼 My mom most of all will really relish them 🙂 pic.twitter.com/VOt9wyLOve
Thank You so much P!! 🤗❤️
— Sushanth A (@iamSushanthA) May 16, 2021
Lovely surprise and def made the day sweeter, especially my mom’s! 🤤🍋@hegdepooja pic.twitter.com/y3J2VR1Jz7