మంగళూరు భామ పూజాహెగ్డే తెలుగు, హిందీ భాషల్లో భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రణ్‌వీర్‌సింగ్ సరసన ‘సర్కస్’ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పరంగా తన కెరీర్లోనే ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిన చిత్రమిదని పూజాహెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హీరో రణ్‌వీర్‌సింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా సెట్స్‌లో ప్రతిక్షణం నవ్వుతూ ఉండేవాళ్లం. యూనిట్ సభ్యులందరూ స్నేహంగా ఉండటం వల్ల ఓ పార్టీలో గడుపుతున్నామనే భావన కలిగేది. ఇక సెట్లో రణ్‌వీర్‌సింగ్ ఉంటే నవ్వుల పండగలా అనిపించేది. అతనిలో హాస్యచతురత, పరిశీలనాశక్తి అద్భుతమని చెప్పొచ్చు. పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నా సరే తనదైన పంచ్‌లతో నవ్వుల్ని పంచుతాడు. నేను అందరితో అంత త్వరగా కలిసిపోను. రణ్‌వీర్‌సింగ్ నా స్వభావానికి పూర్తి విరుద్ధంగా అందరిని నవ్విస్తూ, ఆటపట్టిస్తూ ఉంటాడు. దేవుడు నాకు వరమందిస్తే రణ్వీర్లోని శక్తిని, హాస్యాన్ని కాస్త అప్పుగా ఇవ్వమని అడుగుతా’ అని చెప్పింది. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్ష కుల ందుకురానుంది.