Pooja Hegde | ఫిలిం ఇండస్ట్రీలో పుకార్లు సర్వసాధారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోహీరోయిన్ల మీద ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో బయటకు వచ్చే వార్తలు హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాయి. హీరోయిన్లపై వచ్చే వార్తల్లో నిజమెంతుందో పక్కన బెడితే.. దానిపై చర్చలు మాత్రం ఓ రేంజ్లో సాగుతుంటాయి. అలాంటి పుకారే ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇంతకీ పుకారు ఏ హీరోయిన్‌పై అనుకుంటున్నారా..? ఇంకెవరూ మూవీ లవర్స్ ఎంతగానో ఇష్టపడే పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde). ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా పూజాహెగ్డే సల్మాన్ ఖాన్‌తో డేటింగ్లో ఉందని పుకార్లు కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తన కెరీర్లో నిత్యం పుకార్లు రావడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేసింది పూజాహెగ్డే. తాను పుకార్లను పట్టించుకొని, ప్రతీ ఒక్కరికి సమాధానం ఇవ్వలేనని చెప్పుకొచ్చింది.
ఇటీవలే ఓ నిర్మాత తనకు కారు బహుమతిగా ఇచ్చాడన్న రూమర్‌ను పూజాహెగ్డే ప్రస్తావించింది. సెట్లో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు నాకు నిర్మాత కారు బహుమతిగా ఇచ్చినట్టు పుకార్లు వచ్చాయి. జనాలు నన్ను దూషించాలనుకుంటే కనీసం కారైనా ఇవ్వాలంటూ సరదాగా పుకార్లపై రియాక్ట్ అయింది పూజాహెగ్డే. ప్రస్తుతం మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది.
Read Also :
SAINDHAV | సైంధవ్ క్రేజీ న్యూస్.. సిల్వర్ స్క్రీన్‌పై వెంకటేశ్-నాని కాంబినేషన్
Mano | మల్టీ టాలెంటెడ్ సింగర్ మనోకు అరుదైన గౌరవం
Hombale Films | హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?