SAINDHAV | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సైంధవ్‌లో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఆమె పోషిస్తున్న మనోజ్ఞ రోల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు నాని అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను. సైంధవ్‌లో న్యాచురల్ స్టార్ నాని (Nani) కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దీనిపై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘హిట్టా..? నా రెండు బ్లాక్ బాస్టర్ యే ఈ క్రిస్మస్కు అంటూ నాని 30, సైంధవ్ హ్యాష్ ట్యాగ్‌లను జోడించాడు నాని. దీనిపై శైలేష్ కొలను స్పందిస్తూ.. నాని బ్రో ఆల్ ది బెస్ట్.. అయితే ఈ క్రిస్మస్కు నీవి రెండు సినిమాలు వస్తున్నాయి.. రెండూ హిట్టే..’ అన్నాడు. ఈ ఇద్దరి సంభాషణతో సైంధవ్‌లో నాని కనిపించబోతున్నాడన్నది కన్ఫామ్ అయిపోయింది. మొత్తానికి ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
సైంధవ్ 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వెంకటేశ్ 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సైంధవ్ చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతుండగా.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
నాని ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో నాని 30 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. అంటే ఒక్క రోజు తేడాతో నాని నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయన్నమాట.
Saindhav 1
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
నాని 30 గ్లింప్స్ వీడియో..