Pooja Hegde | అగ్ర కథానాయిక పూజాహెగ్డేపై ఇటీవల కాలంలో సోషల్‌మీడియా వేదికగా రూమర్స్ ప్రచారమవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ హీరోతో ఈ భామ డేటింగ్లో ఉందని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే వాటిని తీవ్రంగా ఖండించింది పూజాహెగ్డే. తాజాగా ఈ భామపై మరో రూమర్ వినిపిస్తున్నది. బడా నిర్మాత నుంచి ఈ అమ్మడు విలువైన కారుని బహుమతిగా అందుకుందని ముంబయి మీడియాలో కథనాలొచ్చా యి.
ఈ వదంతులపై పూజాహెగ్డే అసహనం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సినీ తారలపై రూమర్స్ రావ డం చాలా సహజం. ప్రతీదానికి నేను సమాధానమివ్వలేను. ఓ నిర్మాత నాకు కారు బహుమతిగా ఇ చ్చారని ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలు. సోషల్‌మీడియాలో రూమర్స్‌ను చూసి నా పేరెంట్స్ కూడా ఇవి నిజమేనా? అని అడుగుతున్నారు. ఇక నుంచి ఇలాంటి వార్తలపై స్పం దించి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోను’ అని పేర్కొంది.