గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)ని ఏలుతున్న భామ ఎవరయ్యా..? అంటే ఠక్కున గుర్తొచ్చేపేరు పూజాహెగ్డే (Pooja Hegde). ఈ బ్యూటీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే చాలు..మినిమం హిట్టు గ్యారంటీ. తమ సినిమాల్లో ఏదో ఒక రోల్లో అయినా పూజాహెగ్డేను తీసుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ బ్యూటీ హీరోలు, దర్శకనిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పూజాహెగ్డేకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ విషయమేంటంటే ఈ పొడుగుకాళ్ల సుందరి మరోసారి ఐటెంసాంగ్ (Item Song)లో అందాలు ఆరబోయనుందట. టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు సాధారణంగా ఐటెం సాంగ్స్ వైపు వెళ్లరు. కానీ పూజమ్మ అలా కాదు..ఓ వైపు స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే గతంలో రాంచరణ్ నటించిన రంగస్థలంలో జిగేణి రాణి (Rangasthalam)లా ఊరమాస్ స్టెప్పులేసి కేక పుట్టించింది.
మరి ఇంతకీ ఏ సినిమాలో ఈ సుందరి స్టెప్పులేయబోతుందనే కదా మీ డౌటు. టాలీవుడ్లో రాబోతున్న మల్టీస్టారర్ ఎఫ్ 3 (F3). వరుణ్ తేజ, వెంకటేశ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో ఐటెంసాంగ్ చేయబోతుందని టాక్ నడుస్తుండగా..ప్రస్తుతానికి ఇది గాసిప్లాగే ఉందని టాలీవుడ్ సర్కిల్ టాక్. పూజాహెగ్డే ఈ సాంగ్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.
అంటే దాదాపుగా పూర్తి సినిమాకు తీసుకునే పారితోషికం అన్నమాట. స్టార్ హీరోయిన్ కదా ఆ మాత్రం రేంజ్ మెయింటైయిన్ చేయడం తప్పేమి కాదంటున్నారు సినీ జనాలు. ఓ వైపు లీడింగ్ హీరోయిన్గా సరైన కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తూనే..మరోవైపు ఐటెంసాంగ్స్ చేస్తూ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.