Ponniyin Selvan-2 | మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. గతేడాది విడుదలైన పొన్నియన్ సెల్వన్-1 నిర్మాతలకు కాసుల వర్షం కురిపించి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడిదే బాటలో సీక్వెల్ పార్టు కూడా పయనిస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్‌కు కొనసాగింపుగా వచ్చిన పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2) ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకుకొచ్చింది. కలెక్షన్ల విషయంలో మొదటి రోజు నుంచి తగ్గేదే లే డైలాగ్‌ను అప్లై చేస్తూ.. దూసుకెళ్తోంది. పొన్నియన్ సెల్వన్ 2 కలెక్షన్ల అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 10 రోజుల్లో రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు తెలియజేస్తూ.. అధికారిక ప్రకటన విడుదల చేశారు. రూ.300 కోట్లకుపైగా వసూళ్లతో పొన్నియన్ సెల్వన్ 2 పరంపర కొనసాగుతోందని ట్వీట్ చేసింది లైకా ప్రొడక్షన్స్. పొన్నియన్ సెల్వన్-1 రూ.500 కోట్లకు వసూళ్లు చేసి.. 2022లో అత్యధిక గ్రాస్ సాధించిన తమిళ చిత్రంగా, రెండో అత్యధిక గ్రాస్ సాధించిన ఆల్‌టైమ్ తమిళ సినిమాగా రికార్డుల్లోకెక్కింది. ఇక తాజాగా వచ్చిన కలెక్షన్లు పరిశీలిస్తే.. కేవలం 10 రోజుల్లోనే రూ.300 కోట్లు గ్రాస్ రాబట్టిన సీక్వెల్.. మరి రానున్న రోజుల్లో ఫస్ట్ పార్టు మార్క్‌ను చేరుకుంటుందా..? అనేది చూడాలి మరి.
పొన్నియన్ సెల్వన్ -2లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, పార్థీబన్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, సారా అర్జున్, జయరాయ్, విక్రమ్ ప్రభు, ప్రభు, బాబు ఆంటోని కీలక పాత్రల్లో నటించారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి.
#PS2 continues conquering the box office worldwide with a 300 crore+ collection!
Book your tickets now
🔗 https://t.co/sipB1df2nxhttps://t.co/SHGZNjWhx3#PS2Blockbuster #CholasAreBack#PS2 #PonniyinSelvan2 @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_… pic.twitter.com/sncJ7lPf4K— Lyca Productions (@LycaProductions) May 8, 2023
Anni Manchi Sakunamule | విందు భోజనంలా.. చెయ్యి చెయ్యి కలిపేద్దాం లిరికల్ వీడియో సాంగ్
OG Movie | పూణేలో ఫైట్ సీన్.. ఓజీ మూవీ క్రేజీ అప్డేట్
Adipurush | ప్రభాస్ ఆది పురుష్ ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు.. కానీ