Pawan Kalyan | పవన్ కళ్యాణ్ లైనప్‌లో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ప్రేక్షకులను తీవ్రంగా ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న సినిమా ‘ఓజీ’. ‘సాహో’ వంటి స్టైలిష్ యాక్షన్ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని సుజీత్ ఈ సినిమా చేస్తున్నాడు. రెండు నెలల ముందు రిలీజైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ నెట్టింట సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. మోస్ట్ లైకుడ్ ప్రీ లుక్ పోస్టర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు ‘పంజా’ సినిమాలో అటు ఇటుగా కొంచెం గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్‌ను, పాట షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం పూణేలో ఓ ఫైట్ సీన్ షూట్ జరుపుకుంటుంది. పవన్ ఈ సినిమా కోసం కేవలం రెండు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.